11 ప్రత్యామ్నాయ పత్రాలు చెల్లుబాటు: SIR నమోదుపై సీఈవో కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-03 11:52:59  IST  )

ఏపీలో SIR నమోదు ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. బీఎల్‌వోలు ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుస్తున్నారు. సర్ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు

11 ప్రత్యామ్నాయ పత్రాలు చెల్లుబాటు: SIR నమోదుపై సీఈవో కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో SIR నమోదు ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. బీఎల్‌వోలు ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుస్తున్నారు. సర్ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అయితే 2002‌కు ముందు ఓటు హక్కు వినియోగించుకున్న వారి వివరాలు నమోదులో కొంచెం గందరగోళం నెలకొంటుంది. అయినప్పటికీ బీఎల్వోలు, స్థానిక సచివాలయం సిబ్బంది ఓటర్లకు పూర్తి వివరాలు అందిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకూ 42 శాతం SIR నమోదు ప్రక్రియను పూర్తి చేశారని రాష్ట్ర సీఈవో వివేక్ యాదవ్ స్పష్టం చేశారు.

11 ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాల చెల్లుబాటు

2002 పత్రం లేకుండా 11 ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలు చెల్లుబాటు అవుతాయని ఆయన వెల్లడించారు. బీఎల్‌వోలకు అదనపు శిక్షణ ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. 99 శాతం ఎన్యూమరేషన్ ఫాములను పంపిణీ పూర్తి అయిందని తెలిపారు. జులై 14 నాటికి గరిష్టంగా పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. 2002 ఎన్యూమరేషన్ పత్రం సమర్పించాలని సూచించారు. సచివాలయాల్లోనూ హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసినట్లు సీఈవో వివేక్ యాదవ్ పేర్కొన్నారు.

Next Story