- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపం.. ఏకంగా 28 ఇండిగో సర్వీసులు రద్దు
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (Indigo)కు చెందిన డజన్ల కొద్దీ విమానాలు గురువారం ఆలస్యంగా నడిచాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (Indigo)కు చెందిన డజన్ల కొద్దీ విమానాలు గురువారం ఆలస్యంగా నడిచాయి. మరికొన్ని చోట్ల పూర్తిగా రద్దు అయ్యాయి. ఎయిర్‌లైన్స్ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పాటు క్రూ సభ్యుల కొరత కారణంగా ఈ సమస్యలు ఉత్పన్నమైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Shamshabad International Airport) నుంచి వెళ్లాల్సిన 28 ఇండిగో సర్వీసులు పూర్తిగా రద్దు అయ్యాయి. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 27 విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. హఠాత్పరిణామంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులలో పడిగాపులు కాస్తున్నారు.
మరోవైపు తమ ఫ్లైట్ సర్వీసుల ఆలస్యానికి కారణం సాంకేతిక కారణాలతో పాటు సిబ్బంది అందుబాటులో లేకపోవడమేనని ఇండిగో ప్రకటించింది. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని ఆ సంస్థ హామీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా విమానయాన రంగంలో సిబ్బంది కొరత సమస్య తీవ్రంగా ఉండటంతో ఇండిగోతో పాటు ఇతర సంస్థల విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్న విషయం తెలిసిందే.






