అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం.. ఆందోళనలో ప్రయాణికులు

by Naga Rani Yarlagadda |

శంషాబాద్ ఎయిర్ పోర్టులో (Shamshabad Airport) రన్ వే పైకి వెళ్లిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతికలోపం తలెత్తింది.

అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం.. ఆందోళనలో ప్రయాణికులు
X

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో (Shamshabad Airport) రన్ వే పైకి వెళ్లిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. మూడుసార్లు రన్ వేపైకి వెళ్లగా.. మూడుసార్లు సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై ఫ్లైట్ ను నిలిపివేశాడు. దీంతో ఏమైందో అర్థం కాక ప్రయాణికులు ఆందోళన చెందారు. సాంకేతిక లోపం తలెత్తిన విమానం శంషాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిందిగా తెలుస్తోంది. విమానం ఆలస్యం కావడంతో 37 మంది ప్రయాణికులుఅసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక లోపాలున్న విషయాన్ని ముందు చూసుకోవడం తెలియదా అంటూ సంబంధిత ఎయిర్ లైన్స్ పై ఫైరవుతున్నారు. కాగా.. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఘటన ఇప్పటికీ కళ్లెదుట మెదులుతూనే ఉంది. అప్పటి నుంచి అనేక విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తగా.. ఎయిర్ లైన్స్ సంస్థలకు డీజీసీఐ (DGCI) కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Next Story