ఇంజిన్‌లో సాంకేతిక లోపం.. ఆలస్యంగా నడుస్తున్న కాచిగూడ-మురుడేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-19 03:51:09  IST  )

కాచిగూడ (Kachiguda) నుంచి మురుడేశ్వర్ (Murudeshwar)కు వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం.12789) రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం రావడంతో రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.

ఇంజిన్‌లో సాంకేతిక లోపం.. ఆలస్యంగా నడుస్తున్న కాచిగూడ-మురుడేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్
X

దిశ, వెబ్‌డెస్క్: కాచిగూడ (Kachiguda) నుంచి మురుడేశ్వర్ (Murudeshwar)కు వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం.12789) రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం రావడంతో రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. సాధారణంగా ఉదయం 6:05 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే రైలు 8:05కు బయల్దేరింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజిన్‌లో ఏర్పడిన లోపాన్ని గుర్తించిన వెంటనే సిబ్బంది దాన్ని సరిచేశారు. అయితే, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ట్రైన్ కాచిగూడ నుంచి మురుడేశ్వర్ వరకు సుమారు 1,688 కి.మీ. దూరాన్ని కేవలం 32 గంటల్లో చేరుకుంటుంది. మంగళూరు సెంట్రల్ వద్ద ఇంజిన్ రివర్స్ అవుతుంది. ప్రయాణికులు తాజా స్టేటస్ కోసం IRCTC యాప్ లేదా వెబ్‌సైట్ లేదా NTESలో సమాచారాన్ని పొందవచ్చని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.

Read More..

నిలిచిపోయిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్..

Next Story