- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీచర్లకు ఊరట కల్పించాలి : వర్క్ అడ్జస్ట్‌మెంట్ కొనసాగింపుపై తపస్ విజ్ఞప్తి
పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన రేట్లను పెంచాలని, అలాగే బోధనకు ఆటంకం కలగకుండా ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్‌మెంట్‌ను కొనసాగించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన రేట్లను పెంచాలని, అలాగే బోధనకు ఆటంకం కలగకుండా ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్‌మెంట్‌ను కొనసాగించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ను కలిసి సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులకు చెల్లించే మూల్యాంకన రేట్లను వెంటనే సవరించి, పెంచాలని కోరారు. విద్యార్థుల బోధనకు ఇబ్బంది కలగకుండా, గతంలో చేసిన ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్‌మెంట్‌ను తదుపరి బదిలీలు జరిగేంత వరకు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అడ్జస్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఏప్రిల్ 23 తర్వాత కూడా అదే పాఠశాలలో కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్రోల్మెంట్ (బడిబాట) కార్యక్రమం విజయవంతం కావడానికి ఈ అడ్జస్ట్‌మెంట్ కొనసాగింపు ఎంతో దోహదపడుతుందని వారు వివరించారు. తపస్ ప్రతినిధి బృందంలో రాష్ట్ర అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య, రాష్ట్ర సంఘటన మంత్రి హనుమంతరావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాశీ రావు, పూజారి రమేష్, తదితరులు పాల్గొన్నారు.






