- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలికల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. తాట తీసిన మహిళలు
విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు కామాంధులై కన్నుమిన్ను కానక ప్రవర్తిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు కామాంధులై కన్నుమిన్ను కానక ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్లలపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ.. కామ పాఠాలు బోధిస్తున్నారు. తాము ఏం చేసినా చెల్లుతుందనో ఏమో.. బరితెగించి ఏకంగా క్లాస్ రూంలోనే మొదలెట్టేశారు. గురు, శిష్యుల బంధానికే మాయనిమచ్చ తెచ్చిన ఘటన నెల్లూరు (Nellore) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరికుంటపాడు (Varikuntapadu) మండలం తూర్పు బోయమడుగుల (Thurpu Boyamadugula) గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెంగయ్య అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, కొన్నాళ్ల నుంచి వెంగయ్య (Vengaiah) పాఠశాలకు వచ్చే విద్యార్థినులపై కన్నేశాడు. క్లాస్ చెప్పే సమయంలో ఆడపిల్లలపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం చేసేవాడు. అసభ్యకర పదజాలంతో విద్యార్థులను దూషించేవాడు. దీంతో విసిగివేసారి పోయిన విద్యార్థినులు విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పారు. ఈ పరిణామంతో ఆగ్రహంతో రగిలిపోయిన వారు ఇవాళ పాఠశాలకు వద్దకు వెళ్లి ఉపాధ్యాయుడు వెంగయ్య తాట తీశారు. చదువు చెబుతారని స్కూల్‌కు పంపిస్తే పిచ్చి వేషాలు ఏంటని ప్రశ్నిస్తూనే.. ఏడాపెడా బాదారు. చివరకు ఆ దెబ్బలకు తాళలేక ఉపాధ్యాయుడు వెంగయ్య పాఠశాల పహరీ దూకి పరారయ్యాడు.






