విద్యార్థికి నరకం చూపించిన టీచర్.. కళ్లలో పెన్సిల్‌తో పొడిచి, నోటికి ప్లాస్టర్ వేసి !

by velandi.Saikiran |

ఎల్బీనగర్ లోని ఓ టీచర్... సెకండ్ క్లాస్ చదువుతున్న సాయి నందన్ అనే విద్యార్థిని చితక బాదడమే కాకుండా కళ్ళల్లో పెన్సిల్

విద్యార్థికి నరకం చూపించిన టీచర్.. కళ్లలో పెన్సిల్‌తో పొడిచి, నోటికి ప్లాస్టర్ వేసి !
X

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థుల పట్ల టీచర్లు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. మాట వినడం లేదని, అల్లరి చేస్తున్నారని, మార్కులు తక్కువ వచ్చాయని ఇలా రకరకాల కారణాలతో విద్యార్థులను అత్యంత దారుణంగా కొడుతున్నారు కొంతమంది టీచర్లు. అలా కొట్టిన సంఘటనలు ఈ మధ్యకాలంలోనే విపరీతంగా జరిగాయి. అయితే తాజాగా హైదరాబాదులోనే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఓ విద్యార్థిని కిరాతకంగా కొట్టింది ఓ మహిళా టీచర్. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్బీనగర్ లోని మున్సురాబాద్ బిర్లా ఓపెన్ మైండ్స్ పాఠశాలలో ఓ టీచర్ అత్యంత దారుణానికి పాల్పడింది. సెకండ్ క్లాస్ చదువుతున్న సాయి నందన్ అనే విద్యార్థిని చితక బాదడమే కాకుండా కళ్ళల్లో పెన్సిల్ తో కూడా పొడిచింది. అనంతరం నోటికి ప్లాస్టర్ వేసి మాట్లాడకుండా చిత్రహింసలు పెట్టింది ఆ లేడీ టీచర్.

ఇక ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాదాపు నెల రోజుల నుంచి తమ కుర్రాడికి చికిత్స అందిస్తున్నామని విద్యార్థి తల్లిదండ్రులు.. షాకింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై పాఠశాల యాజమాన్యాన్ని నిలదీస్తే... తమ పైన తల్లిదండ్రులు దాడి చేశారని.. మీడియాకు వెల్లడిస్తున్నారు. ఇక ఈ సంఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. క్లిక్

Next Story