- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AIJACTO: ఫిబ్రవరి 5న ఉపాధ్యాయ పార్లమెంట్ మార్చ్ : ఏఐజాక్టో
అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఎఐజాక్టో) ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఎఐజాక్టో) ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) మినహాయింపు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం, ఎన్సీటీఈ జోక్యం చేసుకుని సీనియర్ ఉపాధ్యాయుల ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేయాలని, పాఠశాలల మూసివేత, విలీనాన్ని నిలిపివేయాలని తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించి ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే అంశాలను రద్దు చేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక ఉపాధ్యాయులకు ఓటుహక్కు కల్పించాలన్నారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్ల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల జాతీయ ఫెడరేషన్లు ఐక్యంగా నిర్వహిస్తున్న పోరాటంలో భాగంగా ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రంలో ఉపాధ్యాయులు సంఘాలకు అతీతంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. యూఎస్‌స్పీసీ, జాక్టో, ఎస్జీటీయూ తదితర సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇదే స్ఫూర్తితో ఫిబ్రవరి 5న పార్లమెంట్ మార్చ్ ను విజయవంతం చేయాలని ఎఐజాక్టో నేతలు చావ రవి, జి సదానందం గౌడ్, పి మల్లికార్జున్ రెడ్డి, ఏ వెంకట్, జుట్టు గజేందర్, పోల్ రెడ్డి, కె శారద ఒక ప్రకటనలో తెలిపారు.






