పాఠాలు చెబుతూనే కుప్పకూలిన టీచర్.. షాకింగ్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

ఇటీవల కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. చూస్తుండగానే మనుషులు కుప్పకూలి మరణిస్తున్నారు. పడిపోయిన తరవాత ఆస్పత్రికి వెళ్లేంత సమయం కూడా ఉండకపోవడంతో పడిన వెంటనే ప్రాణాలు కోల్పోతున్నారు.

పాఠాలు చెబుతూనే కుప్పకూలిన టీచర్.. షాకింగ్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. చూస్తుండగానే మనుషులు కుప్పకూలి మరణిస్తున్నారు. పడిపోయిన తరవాత ఆస్పత్రికి వెళ్లేంత సమయం కూడా ఉండకపోవడంతో పడిన వెంటనే ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా క్షణాల్లో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక తాజాగా అలాంటి ఘటనే రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఖమ్మంలోని మమతా రోడ్డులోని శ్రీ చైతన్య స్కూల్ ఒలింపియాడ్ క్యాంపస్‌‌లో జయరాజు అనే ఉపాధ్యాయుడు పాఠం చెబుతూనే కుప్పకూలిపోయాడు. దీంతో విద్యార్థులు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే అక్కడకు చేరుకుని అతన్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆయన పూర్తిగా స్పృహకోల్పోయారు. ప‌రీక్షించిన త‌ర‌వాత ఆయ‌న చ‌నిపోయిన‌ట్టు నిర్దారించ‌డంతో దిగ్బ్రాంతికి గుర‌య్యారు. దీనికి సంబంధించిన‌ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story