- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తన పేరే బడి పేరుగా మార్చిన గురువు.. బుచ్చయ్య సార్ ఇకలేరు
తన సేవా ధర్మంతో ప్రభుత్వ బడికి తన పేరే ఆడిపాడేలా చేసిన ఓ గౌరవనీయ ఉపాధ్యాయుడు ఇకలేరు. ఎల్లారెడ్డిపేట మండలంలోని కిషన్ దాస్ పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అనేక సంవత్సరాలు ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన బుచ్చయ్య సార్ మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.

దిశ, ఎల్లారెడ్డిపేట: తన సేవా ధర్మంతో ప్రభుత్వ బడికి తన పేరే ఆడిపాడేలా చేసిన ఓ గౌరవనీయ ఉపాధ్యాయుడు ఇకలేరు. ఎల్లారెడ్డిపేట మండలంలోని కిషన్ దాస్ పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అనేక సంవత్సరాలు ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన బుచ్చయ్య సార్ మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.
బుచ్చయ్య సార్ సాధారణ ఉపాధ్యాయుడు కాదనడంలో సందేహమే లేదు. ఆయన అధ్యాపన శైలితో, శ్రమతో, విద్యార్థుల పట్ల తనకున్న ప్రేమతో ఆ బడి అంటే “బుచ్చయ్య సార్ బడి” అనే గుర్తింపు ఏర్పడేలా చేశారు. స్థానికంగా ఆయన పేరు ఒక చిహ్నంగా మారింది. పాఠశాలలో పనిచేసిన సంవత్సరాలపాటు గ్రామ ప్రజల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. అలాంటి విద్యావేత్త మరణం స్థానిక విద్యాభిమానుల హృదయాలను దిగ్రహానికి గురిచేసింది.
బుచ్చయ్యకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. బుచ్చయ్య సార్ మృతి పట్ల అనేకమంది ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తోట ఆగయ్య, మాజీ జడ్పీటీసీ వద్నాల నర్సయ్య, ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు సంపత్, రజిత, ప్రశాంత్, మధ్యాహ్న భోజన నిర్వహకులు బుచ్చం గారి దేవమ్మ, దుబ్బ అంజవ్వలు పాల్గొని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
"గురువు సేవను మరువలేం… ఆ బడిలోనే బుచ్చయ్య సార్ స్మరణ సభ నిర్వహిస్తాం" అని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ తెలిపారు. స్థానికంగా ఆయనకు ఉన్న గుర్తింపు, విద్యారంగంలో చేసిన సేవల వల్ల ఆయన పేరు శాశ్వతంగా ఆ పాఠశాల చరిత్రలో నిలిచిపోతుంది.






