జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు టీడీపీ దూరం!

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-07 17:20:31  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)తో సమావేశమైన తెలంగాణ టీడీపీ(Telangana TDP) నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు టీడీపీ దూరం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)తో సమావేశమైన తెలంగాణ టీడీపీ(Telangana TDP) నేతలు సుదీర్ఘంగా చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై సమావేశంలో కీలకంగా చర్చించారు. ఫైనల్‌గా ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే బీజేపీ అడిగితే.. మద్దతు ఇవ్వాలని.. ఎవరూ అగడకపోతే మొత్తం ఎన్నికకే దూరంగా ఉండాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపైనా ఈ సమావేశంలో చర్చించారు. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.

Next Story