- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణం పోసిన పచ్చబొట్టు..అంత్యక్రియల వరకు వెళ్లి కళ్లు తెరిచిన వ్యక్తి
అంత్యక్రియల వరకు వెళ్లిన వ్యక్తికి అతడి పచ్చబొట్టే ప్రాణం పోసింది. ఈ ఘటన వనపర్తి పట్టణంలోని పీర్లగుట్టలో చోటు చేసుకుంది. తైలం రమేశ్ అనే వ్యక్తి తన అభిమాన నాయకుడు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫోటోను ఛాతీపై పచ్చబొట్టు వేసుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: అంత్యక్రియల వరకు వెళ్లిన వ్యక్తికి అతడి పచ్చబొట్టే ప్రాణం పోసింది. ఈ ఘటన వనపర్తి పట్టణంలోని పీర్లగుట్టలో చోటు చేసుకుంది. తైలం రమేశ్ అనే వ్యక్తి తన అభిమాన నాయకుడు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫోటోను ఛాతీపై పచ్చబొట్టు వేసుకున్నాడు. అయితే రమేశ్ తమ బంధువుల ఇంటికి వచ్చి అల్పాహారం తిన్నతరవాత తీవ్ర అస్వస్థతకు గురవ్వగా ఎలాంటి చలనం లేకుండా పడిపోయాడు. అందరూ అతడు చనిపోయాడని భావించగా, కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సైతం ఏర్పాట్లు చేశారు.
ఈ విషయం నిరంజన్ రెడ్డికి తెలియడంతో వెంటనే ఆయన చివరిచూపు కోసం అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో రమేష్ ఛాతిపై ఉన్న తన పచ్చబొట్టును పరిశీలిస్తుండగా అతడు ఊపిరి పీల్చుకుంటున్నట్టు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే అతడిపై పూలమాలలు తీయించి పేరు పెట్టి గట్టిగా పిలవగా కనురెప్పలు కదిలించాడు. తరవాత ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన తరవాత కొద్దిసేపటికి తైలం రమేశ్ కల్లు తెరిచాడు. చనిపోయాడనుకున్న వ్యక్తి బ్రతకడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.






