‘కేసీఆర్‌ను కడియం శ్రీహరి బ్లాక్ మెయిల్ చేశారు’: మాజీ డిప్యూటీ CM హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari)పై బీఆర్ఎస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘కేసీఆర్‌ను కడియం శ్రీహరి బ్లాక్ మెయిల్ చేశారు’: మాజీ డిప్యూటీ CM హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari)పై బీఆర్ఎస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో రాజయ్య మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్‌కు చేసిందేమీ లేదని విమర్శించారు. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసమే పార్టీలు మారాడని మండిపడ్డారు. కడియం శ్రీహరి అంటే ఒక అవినీతి తిమింగలం అని కీలక ఆరోపణలు చేశారు. పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరికి సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ఆయనకు ఘన్ పూర్ ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. 15 ఏళ్లు మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అభివృద్ధి గుర్తుకు రాలేదా అని నిలదీశారు. తన బిడ్డను ఎంపీ చేయడం కోసం కడియం శ్రీహరి పార్టీ మారారు. తన రాజకీయ సమాధిని తానే కట్టుకున్నారన్నారు. ఆయన విదేశాల్లో ఆస్తులు సంపాదించుకున్నారు, హైడ్రల్ ప్రాజెక్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా పోస్టులు అమ్ముకున్నారు. కడియం శ్రీహరి అభివృద్ధి కావడం తప్పా స్టేషన్ ఘన్ పూర్‌ను అభివృద్ధి చేయలేదని విమర్శించారు. బినామీ పేర్లతో కడియం శ్రీహరికి ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీ మారతనని కడియం శ్రీహరి కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేశారని విమర్శించారు.

Next Story