‘ముక్కు నేలకు రాసి కేసీఆర్‌ను కలువు’.. కడియం‌కు రాజయ్య సూచన

by Gantepaka Srikanth |

స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మరోసారి వేడెక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari)కి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) సంచలన సవాల్ విసిరారు.

‘ముక్కు నేలకు రాసి కేసీఆర్‌ను కలువు’.. కడియం‌కు రాజయ్య సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మరోసారి వేడెక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari)కి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) సంచలన సవాల్ విసిరారు. శనివారం రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. కడియం శ్రీహరి సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రూ.200 కోట్లకు అమ్ముడుపోయి కాంగ్రెస్‌లో చేరారని ఆరోపించారు. అసెంబ్లీ స్పీకర్‌ నోటీసులకు ఇప్పటివరకు కడియం శ్రీహరి వివరణ ఇవ్వలేదని మండిపడ్డారు. పార్టీ ఫారాయించిన కడియం శ్రీహరిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ కడియం ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని తప్పించుకునే ప్రయత్నం చేస్తే.. ముక్కు నేలకు రాసి కేసీఆర్‌(KCR)ను స్వయంగా కలిసి క్షమాపణ చెప్పాలని సూచించారు.

Next Story