- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీ నిన్ను క్షమించే ప్రసక్తే లేదు: తరుణ్ చుగ్ ఫైర్
by Satheesh |
రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అవమానించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ చార్జి తరుణ్ చుగ్ మండిపడ్డారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అవమానించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ చార్జి తరుణ్ చుగ్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ క్షమించరాని నేరానికి పాల్పడ్డారని.. ఆయన దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన తరుణ్ చుగ్ రాహుల్ గాంధీ దేశాన్ని అవమానపరిచే విషయంలో బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ నిన్ను క్షమించేంది లేదని.. దేశ ప్రజలందరికి క్షమాపణలు చెప్పాల్సిందే అన్నారు. మరో వైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంటే అలాంటి ఆశలు పెట్టుకోవద్దని కాంగ్రెస్ ఎదురు దాడికి దిగుతోంది.
Next Story






