- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. తార్నాక జంక్షన్ అండర్ పాస్ క్లోజ్? మళ్లీ యూటర్నే దిక్కు!
యూటర్న్ (U-turn) ఇంప్లిమెంటేషన్లో భాగంగా దాదాపు ఎనిమిదేళ్ల కింద మూత పడిన తార్నాక జంక్షన్ అండర్ పాస్ ఇటీవల రీ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: యూటర్న్ (U-turn) ఇంప్లిమెంటేషన్లో భాగంగా దాదాపు ఎనిమిదేళ్ల కింద మూత పడిన (Tarnaka Junction) తార్నాక జంక్షన్ అండర్ పాస్ ఇటీవల రీ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందకు 15 రోజుల ట్రయల్ రన్‌లో భాగంగా దాదాపు రెండు వారాల క్రితం ఓపెన్ చేశారు. ఇది వరకు ఓయూ క్యాంపస్ నుంచి లాలాపేట వైపు వెళ్లే వారు యూటర్న్ తీసుకోని రాకపోకలు సాగించేవారు. అయితే సిగ్నల్ సిస్టమ్‌ను పునరుద్ధరించడంతో ఓయూ వైపు నుంచి లాలాపేట వైపు వెళ్లే వాహనదారులు నేరుగా సిగ్నల్ వద్ద ఆగి వెళుతున్నారు.
తాజాగా ఈ జంక్షన్ అండర్ పాస్‌ను క్లోజ్ చేసే ఆలోచనలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ యోచిస్తోంది. ఎందుకంటే అండర్ పాస్ వల్ల ఫ్లై ఓవర్ కింద సిగ్నల్ ఓపెన్ చేయడంతో తీవ్రంగా (Traffic jam) ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని తెలిసింది. దీంతో వాహనదారుల నుంచి విమర్శలు, ఫిర్యాదులు రావడంతో ట్రాఫిక్ పోలీసులు రూట్ క్లోజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే సిగ్నల్స్ ఓపెన్ చేయడం వల్ల అటుగా వెళ్లాల్సిన అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో ఇరుక్కొని ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరికలు సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటుంది. ఎక్కువ శాతం ప్రజలు కూడా క్లోజ్ చేయాలని కోరడంతో.. అండర్ పాస్ ఎప్పటిలాగే క్లోజ్ చేసే నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో మళ్ళీ పాత పద్ధతిలోనే వాహనదారులు యూటర్న్ తీసుకోని వెళ్లాల్సి ఉంటుంది.






