- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెట్ తీర్పుపై ఆర్డినెన్స్ తేవాలి : తపస్ డిమాండ్
టెట్ రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల జీవితాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టిందని తపస్ విచారం వ్యక్తం చేసింది.

- కేంద్ర ప్రభుత్వం తక్షణమే చట్ట సవరణ చేయాలి
దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల జీవితాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టిందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) విచారం వ్యక్తం చేసింది. ఈ సమస్యపై స్పందించి బాధితులకు తక్షణ శాసనపరమైన ఉపశమనం కల్పించాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వొద్నాల రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య ఒక ప్రకటన లో తెలిపారు. బాధిత ఉపాధ్యాయులకు శాశ్వత ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తగిన ఆర్డినెన్స్ లేదా చట్ట సవరణ తీసుకురావాలని తపస్ డిమాండ్ చేసింది. లక్షలాది మంది ఉపాధ్యాయులకు సకాలంలో న్యాయం జరగకపోతే, తమ జీవనోపాధిని కాపాడుకునేందుకు ప్రజాస్వామ్యబద్ధమైన, శాంతియుత ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం కావాల్సి వస్తుందని స్పష్టం చేశారు.






