మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చేదు అనుభవం

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. చేవెళ్ల బస్సు ప్రమాదం నేపథ్యంలో తాండూరు-హైదరాబాద్ రోడ్డు సమస్యలపై తాండూరు డెవలప్‌మెంట్‌ ఫోరం, స్థానికులు ధర్నాకు దిగారు. విలేమాన్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేయగా అక్కడకు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వెళ్లారు.

మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చేదు అనుభవం
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. చేవెళ్ల బస్సు ప్రమాదం నేపథ్యంలో తాండూరు-హైదరాబాద్ రోడ్డు సమస్యలపై తాండూరు డెవలప్‌మెంట్‌ ఫోరం, స్థానికులు ధర్నాకు దిగారు. విలేమాన్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేయగా అక్కడకు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏం చేశారని యువత ఆయనను నిలదీశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్డు సమస్యలపై ఎందుకు దృష్టి సారించ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పైలెట్ రోహిత్ రెడ్డి వారికి న‌చ్చ‌బెప్పే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ యువ‌త వెన‌క్కిత‌గ్గ‌లేదు. ఇదిలా ఉంటే చేవెళ్ల ఘ‌ట‌న‌కు గ‌తంలో ఎమ్మెల్యే, ఎంపీలుగా ప‌నిచేసిన‌వాళ్ల‌తో పాటు ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలు కూడా బాధ్యులేన‌ని స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story