తమ్మీ శ్రీనివాస్ నీ కుటుంబ బాధ్యత నాది.. ఫోన్లో కేటీఆర్ భరోసా

by Ramesh Goud |

తమ్మీ శ్రీనివాస్ నీ కుటుంబ బాధ్యత నాది అని హోటల్ (Hotel) నిర్వాహకుడికి ఫోన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) భరోసా ఇచ్చారు.

తమ్మీ శ్రీనివాస్ నీ కుటుంబ బాధ్యత నాది.. ఫోన్లో కేటీఆర్ భరోసా
X

దిశ, వెబ్ డెస్క్: తమ్మీ శ్రీనివాస్ నీ కుటుంబ బాధ్యత నాది అని హోటల్ (Hotel) నిర్వాహకుడికి ఫోన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) భరోసా ఇచ్చారు. సిరిసిల్ల (Siricilla)లో బతుకమ్మ ఘాట్ (Bathukamma Ghat) వద్ద ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను (Small Shops) రెండు రోజుల క్రితం కలెక్టర్ (Collector) సీజ్ (Sieze) చేశారు. అంతేగాక ఇవాళ శ్రీనివాస్ అనే వ్యక్తి టీ దుకాణాన్ని (Tea Shop) సైతం తొలగించారు. చాయ్ దుకాణాన్ని ట్రాక్టర్ (Tractor) పై తరలిస్తుండగా అడ్డుకోబోయిన శ్రీనివాస్ ను పోలీసులు (Police) అరెస్ట్ చేసి, అక్కడి నుంచి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న కేటీఆర్ రోడ్డున పడ్డ చాయ్ దుకాణదారుడు శ్రీనివాస్ కు ఫోన్ (KTR Phone) చేశారు.

ఆయన మాట్లాడుతూ.. తమ్మీ శ్రీనివాస్, తొందర్లోనే వస్తానని, దుకాణం కొత్తది పెట్టించి, తానే ఓపెన్ చేస్తానని తెలిపారు. తమ్ముడు శ్రీనివాస్ అధైర్యపడకు నీ కుటుంబ బాధ్యత నాది అంటూ బాధితుడికి భరోసానిచ్చారు. కాగా ట్రేడ్ లైసెన్స్ (Trade License) లేదనే సాకుతో సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాటు వద్ద శ్రీనివాస్ నడుపుకుంటున్న చాయ్ దుకాణాన్ని రెండు రోజుల క్రితం కలెక్టర్ సీజ్ చేశారు. అంతటితో ఆగని అధికారులు ఈ రోజు క్రేన్ తో శ్రీనివాస్ చాయ్ డబ్బాను తొలగించి ట్రాక్టర్లో తీసుకెళ్లిపోయారు. దీంతో శ్రీనివాస్ కుటుంబం రోడ్డున పడ్డట్టు అయ్యింది. దీనిపై కేటీఆర్ హోటల్ నిర్వాహకుడు శ్రీనివాస్ కు ఫోన్ చేసి భరోసా ఇచ్చాడు.

Next Story