- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : టకీ టకీ మని ఢిల్లీలో పైసలు పడుతున్నాయి : కేటీఆర్
రైతు భరోసా(Rythu Bharosa Money)పైసలు టకీ టకీ మని రైతుల ఖాతాల్లో పడుతాయన్నాయని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారని..కాని రైతులకు మాత్రం పడకుండా టకీ టకీమని డీల్లీలో పైసలు పడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : రైతు భరోసా(Rythu Bharosa Money)పైసలు టకీ టకీ మని రైతుల ఖాతాల్లో పడుతాయన్నాయని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారని..కాని రైతులకు మాత్రం పడకుండా టకీ టకీమని డీల్లీలో పైసలు పడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్ల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. మోసపూరిత 420 హమీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు పాలన చేయడం రావడం లేదన్నారు. ఆరున్నర లక్షల కొత్త రేషన్ కార్డులను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇవ్వనేలేదు అంటూ అబద్ధాలు చెబుతుందని విమర్శించారు. మేం రేషన్ కార్డులు ఇచ్చిన సంగతి అప్పటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ నాయకులను అడిగితే తెలుస్తుందన్నారు.
సమైక్య రాష్ట్రంలో మున్సిపాలిటీలు అంటే మురికికూపాలుగా ఉండేవన్నారు. బల్దియాలు అంటే ఖాయా, పియా, చల్దియా అనే సామెత ఉండేదన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వతా కేసీఆర్ పట్టణాల అభివృద్ది కోసం ప్రత్యేక విజన్‌తో పనిచేయాలని దిశానిర్దేశం చేశారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అందుకే అర్ధిక ఇంజన్లుగా ఉన్న పట్టణాలను, వాటి సమగ్రంగా డెవలప్ చేయాలని అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. పట్టణీకరణ అపాలని కొన్ని దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని..పట్టణాల విస్తరణ అపడం వీలు కాదు కానీ ప్రభుత్వాలకు వాటిని సమగ్రంగా అభివృద్ది చేయడానికి మాత్రం అవకాశం ఉంటుందన్నారు. అందుకే ఆ దిశగా పదేళ్లు పనిచేశామని.. చేసిన పనిని అభివృద్ది నివేదికల రూపంలో ప్రజల ముందుంచామన్నారు.
10 సంవత్సరాలు పాటు జరిగిన పట్టణాల అభివృద్ధి కేవలం డైలాగులు కొడితే కాలేదని పేర్కొన్నారు. పక్క ప్రణాళికతో పాటు అవసరమైన సంస్కరణలు, నిరంతర పర్యవేక్షణ, అవసరమైన నిధులు అందించడం వంటి నిరంతర ఫోకస్‌తోనే తెలంగాణలోని పట్టణాలు ఈరోజు మోడల్ పట్టణాలుగా తయారయ్యాయన్నారు. తెలంగాణ పట్టణాలకు పది సంవత్సరాల్లో అనేక జాతీయ అవార్డులు దక్కాయని గుర్తు చేశారు. గత పది సంవత్సరాలుగా మున్సిపల్ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు పట్టణాల అభివృద్ధి కోసం అద్భుతంగా పనిచేశారన్నారు. పదవీ కాలం ముగిసిన చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజల్లోనే ఉండాలని.. మళ్లీ ఎన్నికలు వస్తే ప్రజలు గెలిపించుకుంటారని స్పష్టం చేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పరిపాలన వికేంద్రీకరణ కార్యక్రమాలు చేపట్టామని, కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు పరిపాలన మరింత దగ్గర అయిందని గుర్తు చేశారు.
మన ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పట్టణాలతో పాటు ప్రజల ఆస్తుల విలువ కూడా పెరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పట్టణాలు అభివృద్ధి కుంటు పడటంతో పాటు ప్రజల ఆస్తుల విలువ కూడా భారీగా పడిపోయిందన్నారు. రియల్ ఎస్టేట్ కుదేలైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా కట్టాల్సింది పోయి హైడ్రా, మూసీ ప్రాజెక్టుల పేరుతో కూలగొడుతున్నారని..ప్రభుత్వాన్ని నడిపే వారి ఆలోచనలు సానుకూలంగా ఉంటే రాష్ట్రం, పట్టణాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
గతంలో నల్లగొండ పట్టణాన్ని సమూలంగా అభివృద్ధి చేసిన మనల్ని కాంగ్రెస్ మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారని మండిపడ్డారు. కానీ అదే నల్లగొండ పట్టణంలో నాలుగు నెలలుగా సిబ్బందికి జీతాలు లేకున్నా పట్టించుకోవడం లేదన్నారు. నా నల్లగొండ పర్యటన తర్వాత నన్ను బచ్చగాడు అంటున్న మంత్రి వెంకట్ రెడ్డి.. సీనియర్ అయ్యుండి కూడా పట్టణ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు వైఫల్యాలపైన డూప్లికేట్ గాంధీలకు తెలంగాణ ఇచ్చిన హమీలను అమలు చేసేలా బుద్ధి ఇవ్వాలని మహాత్ముడి విగ్రహాలకు వినతిపత్రాలు ఇవ్వడం ద్వారా నిరసన వ్యక్తం చేశామన్నారు.






