"హై డోస్ ఇచ్చి ప్రాణాలు తీశారు..!"

by Taduka Kalyani |

కడుపు నొప్పి అని హాస్పిటల్ కు వస్తే ట్రీట్మెంట్ లో భాగంగా హై డోస్ మందులు ఇవ్వడంతో తమ మనిషి చనిపోయాడని మృతుని బంధువులు ఆందోళనకు దిగారు.

హై డోస్ ఇచ్చి ప్రాణాలు తీశారు..!
X

దిశ, సంగారెడ్డి : కడుపు నొప్పి అని హాస్పిటల్ కు వస్తే ట్రీట్మెంట్ లో భాగంగా హై డోస్ మందులు ఇవ్వడంతో తమ మనిషి చనిపోయాడని మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి పట్టణంలోని స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో కౌడిపల్లి మండలం సలాబాద్ పూర్ గ్రామానికి చెందిన పులియ సింగ్ (50) ఈ నెల 23న రాత్రి కడుపు నొప్పి అని చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. అయితే అక్కడి వైద్యులు అతడిని అడ్మిట్ చేసుకొని చికిత్స ప్రారంభించారు. చికిత్స పొందుతూ అతడు ఈ రోజు వేకువజామున మృతి చెందాడు. దీంతో రోగి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కడుపు నొప్పి అని వస్తే అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న మనిషి ఎలా చనిపోతాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రీట్మెంట్ పేరుతో హెవీ డోస్ మందులు ఇవ్వడంతోనే తమ బంధువు మృతి చెందాడని వారు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారిని నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అయితే రోగికి ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ రావడంతోనే అతడు మృతి చెందాడని ఆసుపత్రి సభ్యులు చెబుతున్నారు.

Next Story