TG News : చర్చలు సఫలం.. డిగ్రీ, PG కాలేజీల సమ్మె విరమణ

by Muthe.Rajitha |

ఎట్టకేలకు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు శాంతించాయి.

TG News : చర్చలు సఫలం.. డిగ్రీ, PG కాలేజీల సమ్మె విరమణ
X

దిశ, వెబ్ డెస్క్ : ఎట్టకేలకు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు శాంతించాయి. గత 40 రోజులుగా తెలంగాణలో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు చేస్తున్న సమ్మెను(Colleges Strike) విరమించాయి. సోమవారం కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించాయి. అయితే గత మూడేళ్లుగా కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు(Fee Reimbursement Dues) విడుదల చేయకపోవడంతో.. కళాశాలల యాజమాన్యాలు సమ్మెకు దిగాయి. దీంతో రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు ఇంతవరకు జరగలేదు.

తాము ప్రభుత్వానికి ఎంత సహకరిస్తున్నా, ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇస్తున్నా ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు మాత్రం ఇవ్వకపోవడంతో తప్పనిసరై సమ్మెకు దిగినట్టు యాజమాన్యాలు పేర్కొన్నాయి. నేడు జరిగిన చర్చల్లో ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్టు కాలేజీ యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఈనెల 14 నుంచి జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా నడుస్తాయని పేర్కొన్నారు.

Next Story