- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Talasani Srinivas Yadav: కాంగ్రెస్ నేతలు గీత దాటితే.. మేము కూడా దాటుతాం
కాంగ్రెస్(Congress) నేతలు గీత దాటితే తాము కూడా దాటుతామని బీఆర్ఎస్ కీలక నేత, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress) నేతలు గీత దాటితే తాము కూడా దాటుతామని బీఆర్ఎస్ కీలక నేత, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అధ్యక్షతన గ్రేటర్ పరిధిలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం తలసాని మీడియాతో మాట్లారు. గ్రేటర్ అభివృద్ధి(Greater Development), నిధులపై చర్చించినట్లు తెలిపారు. ఎన్నికల వేళ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపైనా చర్చించినట్లు స్పష్టం చేశారు. నగర మేయర్ విజయలక్ష్మి(Mayor Vijayalakshmi)పై అవిశ్వాసంతో పాటు అన్ని అంశాలపై నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం చర్చకు రాలేదని స్పష్టం చేశారు. పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామంటే తాము అడ్డుకోమని అన్నారు. కానీ అర్హులైన అందరికీ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.
కేవలం కాంగ్రెస్ నేతల అనుచరులకు, శ్రేణులకు ఇచ్చుకుంటూ పోతామంటే కుదరదు అని అన్నారు. కాంగ్రెస్ నేతలు గీత దాటితే.. తాము కూడా దాటుతామని.. ఇందులో ఎటువంటి అనుమానం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రోజు కూడా, ఎవరినీ ఇబ్బందులకు గురి చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నివర్గాలకు కష్టాలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు. ఈ నెల 23 వ తేదీన GHMC, ట్రాఫిక్ పోలీసులు, టౌన్ ప్లానింగ్ తదితర శాఖలకు చెందిన అధికారులతో కలిసి మినిస్టర్ రోడ్, జవహర్ జనతా, మోండా మార్కెట్ డివిజన్‌లలో పర్యటించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.






