- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవాకులు చెవాకులు పేలినంత మాత్రాన చరిత్ర మారదు
అవాకులు చెవాకులు పేలినంత మాత్రాన చరిత్ర మారదు

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ వాళ్ల లాగా తాము మూర్ఖుల్లా మాట్లాడబోమని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించే కార్యక్రమ ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దీక్ష ఒక చరిత్ర అని.. కొంతమంది సోయిలేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ రాకపోతే కాంగ్రెస్ ఎక్కడిదని.. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడిదని ప్రశ్నించారు. కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పేలినంత మాత్రాన కేసీఆర్ చరిత్ర మారదన్నారు. కొత్త బిచ్చగాళ్లు పొద్దెరగరు అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బతుకమ్మ పేరుతో ఆనాడు చీరలు పంచితే.. ఇప్పుడు ఇందిరమ్మ చీరలు అని పేరు మార్చారని.. కేసీఆర్ తన పేరు పెట్టుకోలేదని అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ దీక్షా దివాస్‌ను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర చరిత్ర తెలియని వారు సైతం మాట్లాడుతున్నారని.. ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా తెలంగాణ ఏర్పాటప్పుడు ఎక్కడున్నారని నిలదీశారు. కేసీఆర్ అవాకులు చెవాకులు పేలినంత మాత్రాన కేసీఆర్ చరిత్ర మారదన్నారు. రాష్ట్రాన్ని సాధించకపోతే ఇప్పుడు మాట్లాడుతున్న వారికి పదవి ఎక్కడిదని ప్రశ్నించారు.






