- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో చేరి బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని చెప్పుకునే ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సిగ్గులేదని మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. శనివారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. స్పీకర్ విచిత్రమైన తీర్పు ఇచ్చారని, ఆ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో ఉంటే తమతోపాటు వచ్చి కూర్చోవాలని సవాల్ విసిరారు. చేర్చుకున్న వాళ్లు మా వాళ్లు కాదు అని కాంగ్రెస్ చెబుతోందని ఎగతాళి చేశారు. కేసీఆర్ తెలంగాణ సాధనతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, లేకపోతే వారికి పదవులే లేవన్నారు. ఇంకా రెండేళ్ల తర్వాత మనమే అదికారంలోకి వస్తామని అప్పడు తమ తడఖా ఏమిటో చూపిస్తాని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీఎం రేవంత్ రాజీనామా చేయాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీతో కాంగ్రెస్ మోసం చేసిందని, సంక్షేమ నిధులు ఎమ్మెల్యేల ఇళ్ల నుంచి వస్తున్నాయా అని ప్రశ్నించారు. సచివాలయం, ప్రజాభవన్ బాగాలేవని కాంగ్రెస్ అంటోందని మరి రోజూ అక్కడే ఎందుకు కూర్చొంటారని నిలదీశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇలాంటి దరిద్రమైన ప్రభుత్వం చూడలేదని రాష్ట్రంలో 25 ఏళ్ల వరకు కాంగ్రెస్ అనే మాటే వినబడదన్నారు.






