- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Talasani Srinivas: మత సామరస్యానికి ప్రతీక రంజాన్
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సాయంత్రం బేగంపేటలోని పాటిగడ్డలో బీఆర్ఎస్ నాయకుడు నాని ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సాయంత్రం బేగంపేటలోని పాటిగడ్డలో బీఆర్ఎస్ నాయకుడు నాని ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లింలకు తలసాని పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు నెలరోజులపాటు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టడం ఆనవాయితీ అని అన్నారు. ఉపవాస దీక్షలు చేపట్టిన వారికి కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందును ఏటా ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, నాయకులు నరేందర్, ఆరీఫ్, శేఖర్, మోయిన్, హాబీబ్, మహిళా నాయకురాలు నసీమా పా తదితరులు పాల్గొన్నారు.






