- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS: కర్ణాటక ముఖ్యమంత్రితో అబద్ధాలు చెప్పిస్తారా?
వెనుకబడిన తరగతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వెనుకబడిన తరగతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. గురువారం ఉదయం గన్‌పార్క్ వద్ద బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రతి బడ్జెట్‌లో రూ.20వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేశారని పేర్కొన్నారు. సిద్ధరామయ్యతో అబద్ధాలు చెప్పించి బీసీల ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. బీసీ సబ్ ప్లాన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి ఏడాది రూ.800 కోట్లు ఖర్చు చేస్తామని మోసం చేశారని పేర్కొన్నారు. రెండో ఏడాది రూ.11వేల కోట్లు నిధులు కేటాయించి రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే టైం వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో బీసీలే ఆ పార్టీని బొంద పెడుతారని హెచ్చరించారు. లోకల్ బాడీ ఎలక్షన్‌లో జనరల్ స్థానాల్లో బీసీలు గెలిచారని.. అది దేనికి సంకేతమో అర్థం చేసుకోవాలని సూచించారు. అనేక మంది బీసీ నాయకులకు అత్యున్నత పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అని గుర్తుచేశారు.






