లైంగిక వేధింపుల కేసులో తహసీల్దార్ అరెస్టు

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-12 15:17:13  IST  )

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు విశ్వసనీయ సమాచారం.

లైంగిక వేధింపుల కేసులో తహసీల్దార్ అరెస్టు
X

లైంగిక వేధింపుల కేసులో తహసీల్దార్ అరెస్టు

- మహిళా ఉద్యోగిని వేధించిన ఘటనలో కేసు నమోదు

దిశ, పెగడపల్లి: ఓ మహిళ ఉద్యోగినిని లైంగికంగా వేధింపులకు గురి చేసిన కేసులో పెగడపల్లి తహసీల్దార్ రవీందర్ నాయక్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల టౌన్ ఇన్ స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. డ్యూటీలో భాగంగా ఇదివరకు కలిసి పని చేసిన ఓ మహిళా ఉద్యోగిని తహసీల్దార్ రవీందర్ వేధించిన్నట్లు ఇన్ స్పెక్టర్ తెలిపారు. వాట్సాప్ లో అసభ్యకరంగా మెసేజ్ లు పెట్టడంతో పాటు కాల్స్ చేసి లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా వివరించారు. తహసీల్దార్ తీరుతో విసిగిపోయిన యువతి జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా యువతి ఇచ్చిన పిటిషన్ ఆధారంగా తహసీల్దార్ రవీందర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఇన్ స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.

Next Story