- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tadicharla-1: తాడిచర్ల-1 బొగ్గు గనులు తెలంగాణకే.. రాజ్యసభలో కేంద్రం క్లారిటీ
by Prasad Jukanti |
తాడిచర్ల-1 బొగ్గు గనులను 2015లోనే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు కేటాయించినట్లు రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తాడిచర్ల -1 బొగ్గు గునుల (Tadicherla Coal Block) కేటాయింపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ గనులను తెలంగాణకు కేటాయించామని ఇవాళ రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. 2015లో తెలంగాణ విద్యుత్ సంస్థకు కేటాయించామని తెలిపారు. ఇవాళ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ అడిగి ప్రశ్నకు బదులిచ్చిన కిషన్ రెడ్డి.. 2019 మార్చిలో ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆమోదం తర్వాత 2020 జూన్ నుంచి గనుల కేటాయింపుల ప్రక్రియ మారిందని తెలిపారు. వ్యాపారానికి వాడే గనులను వేలంలో కేటాయించాలని కమిటీ సూచించిందని, ప్రత్యేక, తప్పని పరిస్థితుల్లోనే బొగ్గు శాఖ నేరుగా కేటాయించాలని కమిటీ తెలిపిందన్నారు. తాడిచర్ల-2 గనులు ఇంకా ఎవరికీ కేటాయించలేదని స్పష్టం చేశారు.
దాడిచర్లపై ఆరోపణలు:
కాగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాడిచర్ల కోల్ బ్లాక్ ను జెన్కోకు కేటాయించాం. దీని మైనింగ్ చేసేందుకు సింగరేణి ముందుకొస్తే.. వారితో ‘మేం పనిచేయలేమని బీఆర్‌ఎస్ ప్రభుత్వం లేఖ రాయించుకుని’ ప్రైవేటు కంపెనీకి 25 ఏళ్ల టెండర్ కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? అని ఇటీవల కిషన్ రెడ్డి విమర్శించారు. ఇవాళ సుమారు.. రూ.47వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి పడింది. దేశంలో ఏ కోల్ మైనింగ్ కంపెనీకి కూడా ఈ స్థాయిలో ఇబ్బందుల్లేవని వ్యాఖ్యానిచారు. ఇదిలా ఉంటే తాడిచెర్ల గనులను ఏఎంఆర్ కంపెనీకి గుట్టు చప్పుడు కాకుండా 30 ఏళ్ల కాలం పాటు అప్పజెప్పారని, ఇందులో కేసీఆర్ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు గత ప్రభుత్వ హాయంలో వినిపించాయి. ఈ గనుల ప్రైవేటీకరణను రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని నాడు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఏఎంఆర్ కంపెనీకి తాడిచర్ల బొగ్గుగనుల కేటాయింపులపై విచారణ జరిపించాలని నాడు పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు డిమాండ్ చేశారు. ఈవివాదంపై తాజాగా కేంద్రం స్పందిస్తూ.. తాడిచర్ల-1 బొగ్గు గనులను తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు కేటాయించినట్లు క్లారిటీ ఇచ్చింది.
Next Story






