విద్యాశాఖ పరిధిలోకి టీ-శాట్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సమాచార సాంకేతిక, ప్రసారాల శాఖ పరిధిలో ఉన్న టీశాట్ ను విద్యాశాఖకు బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యాశాఖ పరిధిలోకి టీ-శాట్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సమాచార సాంకేతిక, ప్రసారాల శాఖ పరిధిలో ఉన్న టీశాట్ ను విద్యాశాఖకు బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా విద్యా సంబంధిత ప్రసారాలు, డిజిటల్ లెర్నింగ్ అంశాలు నేరుగా విద్యాశాఖ పర్యవేక్షణలోకి రానున్నాయి. టీశాట్ ను విద్యాశాఖతో అనుసంధానించి, డిజిటల్ విద్య బోధనను విస్తృతం చేయనున్నారు. నాణ్యమైన విద్యను డిజిటల్ విధానంలో విద్యార్థులకు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల వారికీ, ప్రభుత్వ పాఠశాలలకు చేరవేయనున్నారు.

టీశాట్ పాఠశాల విద్య, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యా విషయాలతో పాటుగా పదో తరగతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందిస్తోంది. టీశాట్ ద్వారా ఆన్ లైన్ లో ఉచితంగా పాఠాలు అందుబాటులో ఉంటాయి. దీనిలో క్లాసులు వినడం ద్వారా కోచింగ్ సెంటర్లకు వెల్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో నుండే పాఠాలు వినే సౌకర్యం ఉంది. శాటిలైట్, కేబుల్ నెట్వర్క్ , ఓటీటీ వేదికల ద్వారా 4.8 మిలియన్ యూజర్లను చేరుకుని, దేశంలోనే విద్యా ప్రసార ఛానళ్లలో మొదటి స్థానాన్ని సాధించింది.

Next Story