- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెట్ ఎగ్జామ్‌పై టీ-సాట్ స్పెషల్ లైవ్
తెలంగాణ ప్రభుత్వం జూన్ నెలలో నిర్వహించబోయే టెట్ (తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష) పై టీ-సాట్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం జూన్ నెలలో నిర్వహించబోయే టెట్ (తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష) పై టీ-సాట్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు టీ-సాట్ నిపుణ ఛానల్ ప్రత్యేక లైవ్ కార్యక్రమంలో ప్రధాన సబ్జెక్స్ కు సంబంధించి నలుగురు ఎక్స్ పర్ట్స్ పాల్గొంటారని, పరీక్షలో ప్రధానంగా ఎదుర్కోబోయే సమస్యలు, సమయ పాలన, పరీక్ష రాసే విధానం తదితర జాగ్రత్తలు సబ్జెక్టుల వారీగా వివరిస్తారన్నారు. జూన్ 15వ తేదీ నుండి 30వ తేది వరకు 15 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే పరీక్షలపై అభ్యర్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేశామని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ సందేహాలకు సమాధానాల కోసం 040-23540326, 726 టోల్ ఫ్రీ 1800 425 4039 నెంబర్లకు కాల్ చేయాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు.
50 రోజులు 200 ఎపిసోడ్స్ ప్రత్యేక ప్రసారాలు..
తెలంగాణ ప్రభుత్వం జూన్ 15వ తేది నుండి 30వ తేది వరకు నిర్వహించబోయే ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసే అభ్యర్థులకు టీ-సాట్ అరగంట నిడివిగల ప్రత్యేక పాఠ్యాంశాలను సుమారు 200 ఎపిసోడ్స్ సిద్ధం చేసి ప్రసారం చేస్తోందని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. టీ-సాట్ విద్య ఛానల్ ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు, నిపుణ ఛానల్ సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రసారాలు కొనసాగుతున్నాయన్నారు. టెట్ పరీక్ష రెండు పేపర్లకు సంబంధించి లాంగ్వేజెస్ తో పాటు పెడగాజీ, ఎన్విరాన్ మెంట్ సైన్స్, ఛైల్డ్ డెవెలప్ మెంట్ తదితర సబ్జెక్టులలో వీడియో పాఠ్యాంశాలను ప్రసారం చేస్తున్నామని, అభ్యర్థులు టీ-సాట్ అందించే కంటెంట్ ను సద్వినియోగం చేసుకుని, డబ్బు, సమయాన్ని ఆదాచేసుకోవాలని సూచించారు. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన పోటీ పరీక్షలకు టి-సాట్ కంటెంట్ ఎంతగానో ఉపయోగపడిందన్న విషయాన్ని స్వయంగా అభ్యర్థులే తెలియజేయడం పాఠ్యాంశాల నాణ్యతకు అద్దంపడుతోందని సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
- Tags
- TSAT






