- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T Congress Candle Rally : పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టీ కాంగ్రెస్ శాంతి ర్యాలీ
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalagam Terror Attack)లో 26 మంది అమాయకులు బలైన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalagam Terror Attack)లో 26 మంది అమాయకులు బలైన సంగతి తెలిసిందే. కాగా ఈ దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా శాంతి ర్యాలీ(Congress Candle Rally)కి పిలుపు నిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా మరికొద్దిసేపట్లో టీ కాంగ్రెస్(T Congress) నేతలు శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే హైదరాబాద్ లో రైజింగ్ భారత్ సమ్మిట్-2025(Raising Bharat Summit 2025) జరుగుతున్న నేపథ్యంలో విదేశీ ప్రతినిధులు కూడా శాంతి ర్యాలీలో పాల్గొంటారని సమాచారం. ఉగ్రదాడి నేపథ్యంలో నిన్న ఢిల్లీలో ఏఐసీసీ నాయకులు సమావేశం అయ్యారు. బాధితులకు అండగా నిలబడాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా శాంతి ర్యాలీ జరపాలని నిర్ణయించారు. అన్ని రాష్ట్రాల్లో, డివిజన్లలో శాంతి ర్యాలీ చేపట్టాలని.. ఇందులో నేతలు, కార్యకర్తలంతా పాల్గొనాలని ఏఐసీసీ(AICC) ప్రతినిధులు పిలుపునిచ్చారు.
అందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆధ్వర్యంలో ఈ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రకటించారు. పీపుల్స్ ప్లాజా వద్ద నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ఈ క్యాండిల్ ర్యాలీ జరగనుంది. ఇక హైదరాబాద్ లో జరుగుతున్న భారత్ సమ్మిట్ కు 100కు పైగా దేశాల నుంచి 450కి పైగా ప్రతినిధులు హాజరయ్యారని పేర్కొన్న భట్టి.. అంతర్జాతీయ న్యాయం, సమానత్వం, ప్రగతిశీల సహకారంపై ప్రధానంగా చర్చ జరుపుతామని వెల్లడించారు. గ్లోబల్ జస్టిస్ కోసం అందరూ కలిసి రావాలని.. తెలంగాణ రైజింగ్ పై కూడా సమ్మిట్ లో చర్చించామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.






