T Congress: గాయ్‌గాయ్ చేసిన కిష‌న్‌రెడ్డి ఇప్పుడెందుకు గ‌ప్‌చుప్ అయ్యిండు? బీజేపీ స్టేట్ చీఫ్ కు టీ కాంగ్రెస్ కౌంటర్

by Prasad Jukanti |

మీ బీజేపీకే రేవంత్ రెడ్డి ఫోబియా ప‌ట్టుకున్న‌దని కాంగ్రెస్ ఎటాక్ చేసింది.

T Congress: గాయ్‌గాయ్ చేసిన కిష‌న్‌రెడ్డి ఇప్పుడెందుకు గ‌ప్‌చుప్ అయ్యిండు? బీజేపీ స్టేట్ చీఫ్ కు టీ కాంగ్రెస్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachander Rao) చేసిన విమర్శలకు తెలంగాణ కాంగ్రెస్ (T Congress counter) కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు అధికారిక ఎఫ్ బీలో పోస్టు చేసిన కాంగ్రెస్.. 'మీ బీజేపీకే రేవంత్ రెడ్డి ఫోబియా (Revanth Reddy Phobia) పట్టుకున్నది బీజేపీ రాష్ట్ర అధ్యక్షా! అందుకే బీఆర్ఎస్‍‍తో క‌లిసి ప్రజా స‌ర్కారుపై కుట్రలు చేస్తున్నారు. కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగించాలని గాయ్ గాయ్ చేసిన కిషన్ రెడ్డి ఇప్పుడెందుకు గ‌ప్‌చుప్ అయ్యిండు?. రాష్ట్ర సమస్యల ప‌రిష్కారం కోసం సీఎం ఢిల్లీ వెళ్తే త‌ప్పా?16 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. తెలంగాకు మీరు ఒరగబెట్టిందేంటి? అని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది.

Next Story