- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్ చార్జ్ వైస్ ప్రెసిడెంట్‌లను నియమించిన టీ కాంగ్రెస్
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నియమించారు.

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నియమించారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక వైస్ ప్రెసిడెంట్, ముగ్గురు జనరల్ సెక్రటరీలను నియమించారు. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్ వైస్ ప్రెసిడెంట్‌ల పేర్లను ప్రకటించారు. ఆదిలాబాద్ ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గానికి కే. రఘువీర్ రెడ్డిని నియమించారు.
పెద్దపల్లి నియోజకవర్గానికి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కరీంనగర్‌కు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జహీరాబాద్ బండి రమేష్, మెదక్‌కు ఆలం ఖాన్, మల్కాజ్‌గిరికి ఎమ్మెల్సీ భసవరాజు సారయ్య, సికింద్రాబాద్ హనుమండ్ల జాన్సీరెడ్డి, హైదరాబాద్‌కు చిన్నపాటల సంగమేశ్వర్, చేవెళ్లకు బొంతు రామ్మోహన్, మహబూబ్‌నగర్‌కు ఎం.వేణు గౌడ్, నాగర్ కర్నూల్ కొండేటి మల్లయ్య, నల్గొండ నమిడ్ల శ్రీనివాస్, భోనగిరి కోమటిరెడ్డి వినయ్ రెడ్డి, వరంగల్ చిట్ల సత్యనారాయణ, మహబూబ్‌బాద్ పొట్ల నాగేశ్వర్ రావు, ఖమ్మం శ్రావణ్ కుమార్ రెడ్డిని నియమించారు.






