T-Chip: సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధిపై టీ-చిప్ రోడ్‌మ్యాప్.. మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసలు

by Ramesh Naini |

సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధిపై టీ-చిప్ రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది.

T-Chip: సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధిపై టీ-చిప్ రోడ్‌మ్యాప్.. మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధిపై టీ-చిప్ రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. దీనికి సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను సోమవారం సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu)కు టీ-చిప్ (టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రాం) చైర్మన్, ఎండి సందీప్ కుమార్ మక్తాలా అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సెమీకండక్టర్ పరిశ్రమల అభివృద్ధికి టీ-చిప్ రూపొందించిన రోడ్ మ్యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్రాన్ని సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో టాలెంట్, డిజైన్, మాన్యుఫాక్చరింగ్, అప్లికేషన్స్‌లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. (T-Chip) టీ-చిప్ అందజేసిన నివేదిక తెలంగాణ సెమీకండక్టర్ (Semiconductor) విజన్‌లో మైలురాయిగా నిలుస్తోందని ప్రశంసించారు. టీ-చిప్ బృందం ఇటీవల తైవాన్, హాంకాంగ్, తదితర దేశాల్లో పర్యటించి సేకరించిన కీలక వివరాలతో ఈ DPRను రూపొందించినట్లు టీ-చిప్ చైర్మన్, ఎండి సందీప్ కుమార్ మక్తాలా తెలిపారు. ప్రపంచ అగ్ర సంస్థలు ఈ పర్యటన బృందంలో సభ్యులుగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణను భారత్ సెమీకండక్టర్ విప్లవానికి లాంచ్‌ప్యాడ్‌గా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. రాష్ట్రం మోడల్ గ్లోబల్ రిప్లికేషన్‌కి అనుకూలంగా ఉండి, UAE, మలేషియా, ఆసియా, మిడిల్ ఈస్ట్ దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.

నివేదికలో పేర్కొన్న అంశాలు..

టాలెంట్: 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే 1.5 మిలియన్ సెమీకండక్టర్ నిపుణుల కొరతను దృష్టిలో పెట్టుకుని, భారత్‌లో అవసరమయ్యే 85,000 నిపుణులను తీర్చేందుకు 1,000 ప్రొఫెసర్లు, 10,000 విద్యార్థులకు శిక్షణ అవసరమని తేల్చించింది.

డిజైన్: ARM, Synopsys వంటి గ్లోబల్ నేతృత్వ సంస్థల భాగస్వామ్యంతో డిజైన్ హబ్‌లు, ఆధునిక EDA టూల్స్, IP లైబ్రరీల ఏర్పాటు చేయాలని సూచించింది. 3. మాన్యుఫాక్చరింగ్: TSMC, Faraday మోడల్స్ ప్రేరణతో, PUFsecurity సెక్యూర్ ఫ్రేమ్‌వర్క్‌ల అనుసరణ అవసరమణి గుర్తించారు.

అప్లికేషన్స్: EV బ్యాటరీలు (GUS Technology), ట్రాన్స్‌పరెంట్ డిస్ప్లేలు (LiteMax), AI-రెడీ సర్వర్లు (Supermicro), అధునాతన రోబోటిక్స్ (TAIROS) రంగాల్లో వినియోగం ఉంటుందని పేర్కొన్నారు.

Next Story