T BJP: మహా కుంభమేళాను మృత్యుకేళిగా మార్చిన నెహ్రూ.. బీజేపీ సంచలన ఆరోపణలు

by Ramesh Goud |   (  Updated:2025-01-20 12:03:46  IST  )

నెహ్రూ హయాంలో మృత్యుహేళ.. మోడీ సారథ్యంలో మహాద్భుతంగా మహా కుంభమేళ అని బీజేపీ తెలంగాణ(BJP Telangana) ఆరోపించింది.

T BJP: మహా కుంభమేళాను మృత్యుకేళిగా మార్చిన నెహ్రూ.. బీజేపీ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: నెహ్రూ హయాంలో మృత్యుహేళ.. మోడీ సారథ్యంలో మహాద్భుతంగా మహా కుంభమేళ అని బీజేపీ తెలంగాణ(BJP Telangana) ఆరోపించింది. ఉత్తరప్రదేశ్(Uttarapradesh) లోని ప్రయాగ్ రాజ్(Prayag Raj) లో మహా కుంభమేళ(Maha kumbhamela) ఘనంగా జరుగుతోంది. మహా కుంభమేళాకు అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా మహా కుంభమేళా ఏర్పాట్ల పట్ల కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తూ.. బీజేపీ తెలంగాణ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఇందులో 144 ఏళ్ల కొకసారి జరిగే మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతారు అనేది సత్యమని, అందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో కాంగ్రెస్ నిత్యం విఫలమవుతూ వస్తోందని తెలిపింది.

1954 లో జరిగిన మహాకుంభమేళాలో ఫిబ్రవరి 3న మౌని అమావాస్య రోజున అసంఖ్యాకంగా భక్తులు, సాధువులు, అఘోరాలు తరలివచ్చారు. అదే రోజు ప్రధాని నెహ్రూ వస్తున్నారని బారీకేడ్లు ఏర్పాటు చేయడంతో జరిగిన తొక్కిసలాటలో.. అధికారికంగా 800 వందల మంది చనిపోయినా.. అనధికారిక లెక్కల ప్రకారం 2 వేల మంది చనిపోయి ఉండొచ్చిని సమాచారం ఉందని తెలిపింది. 2013 మహాకుంభమేలా లో కూడా అలహాబాద్ రైల్వే స్టేషన్(Alahabad Railway Station) సమీపంలో 36 మంది చనిపోయారని తెలిపింది. ఇప్పుడు జరుగుతున్న కుంభమేళాలో మోడీ ప్రభుత్వం(Modi Government) సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిందని వివరించింది. ఇక దీనిపై మహా కుంభమేళాను నెహ్రూ మృత్యుకేళిగా మార్చారని, 2 వేల మంది సాధువులు, భక్తులను పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. అలాగే అదే నిర్లక్ష్యంతో 2013లోనూ భక్తుల చావుకు హస్తం పార్టీ కారణమైనదని, కానీ మోదీ సారధ్యంలో మహాధ్బుతంగా మహా కుంభమేళా! జరుగుతోందని చెప్పుకొచ్చింది.

Next Story