- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గవర్నర్ దత్తాత్రేయ కూతురికి కీలక పదవి ఇచ్చిన టీ-బీజేపీ
ఎన్నికల వేళ టీ- బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ మాజీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ టీ- బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ మాజీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామించింది. ఈ మేరకు టీ- బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బండారు విజయలక్ష్మి ప్రస్తుతం అలయ్ బలయ్ పౌండేషన్ చైర్మన్‌గా ఉన్నారు. అయితే, దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి బీజేపీ తరుఫున ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశ పడ్డారు. హైదరాబాద్‌లోని ఏదో ఒక స్థానం నుండి ఆమె బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించడంతో.. విజయలక్ష్మి ముషీరాబాద్ స్థానం నుండి పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి.
ముషీరాబాద్ నుండి పోటీ చేసేందుకు ఆమె కూడా ఆసక్తిగా ఉన్నారని.. ముషీరాబాద్ టికెట్ ఈ సారి ఆమెకేనని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరిగింది. తండ్రికి పార్టీల పరిచయాలు ఎక్కువగా ఉండటం.. సీనియర్ నేత కావడంతో విజయలక్ష్మికి ముషీరాబాద్ టికెట్ దక్కడం లాంఛనమేననని అంతా అనుకున్నారు. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం అనూహ్యంగా ఆమె టికెట్ ఇవ్వకుండా మొండిచేయి చూపించింది. ముషీరాబాద్ నుండి బీజేపీ టికెట్‌ను ఎంపీ లక్ష్మణ్ అనుచరుడు రాజుకు కేటాయించారు. ముషీరాబాద్ కాకున్న సిటీలో మరో స్థానం నుండి విజయలక్ష్మికి టికెట్ దక్కుతుందని ప్రచారం జరగగా.. చివరకు అలాంటిదేమి కూడా ఏమి జరగలేదు. ఆమె అసలు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. దీంతో విజయలక్ష్మి కాస్త సెలైంట్ అయ్యారు. ఈ నేపథ్యంలో విజయలక్ష్మిని పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడం హాట్ టాపిక్‌గా మారింది.






