- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T-BJP: తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు.. సునీల్ బన్సల్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర బీజేపీ ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో విజయఢంకా మోగించడంతో భవిష్యత్తు ఎన్నికలపై దృష్టి పెట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బీజేపీ ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో విజయఢంకా మోగించడంతో భవిష్యత్తు ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఈ మేరకు శనివారం పార్టీ సీనియర్లతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి రాష్ట్ర ఇంచార్జీ సునీల్బన్సల్హాజరైయ్యారు. ఈ సందర్బంగా పార్టీ నేతలకు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించినంత మాత్రాన అప్పడే పొంగి పోవద్దని త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీలు, సర్పంచులు వందల సంఖ్యలో గెలిచేలా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. అదే తరహాలో దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో కూడా ఉనికి చాటాలని నిర్ధేశించారు.
పార్లమెంటు ఎన్నికలతో పాటు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనుసరించిన వ్యుహాలను నాయకులు, కార్యకర్తలు పాటిస్తూ విబేధాలు వీడి ఐక్యంగా పని చేయాలని సూచించారు. పార్టీకి మంచి ఊపు రావడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్‌లు తమ పార్టీని, నాయకులను అభాసుపాలు చేసేందుకు కుట్రలు చేసే అవకాశం ఉందని వాటి పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. అదే విధంగా వన్‌నేషన్.. వన్ఎలక్షన్పై కేంద్ర ప్రభుత్వం తీసుకోనే నిర్ణయాలకు అందరు కట్టుబడి ఉండాలని, దీని ద్వారా దేశానికి ఎంత మేలు జరుగుతుందో ప్రజలకు వివరించాలని కోరారు. భారతరత్న అటల్‌బిహారీ శత జయంతి ఉత్సవాలను ఊరురా గ్రామ గ్రామాన నిర్వహించేందుకు ముందుగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పార్టీ కోసం శ్రమించిన విధానం వేరు, ఇంకా నుంచి కష్టపడే విధానం మరో విధంగా ఉంటుందన్నారు.
తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించేందుకు సిద్దంగా ఉన్నారని, నాయకులే ప్రజలు వద్దకు వెళ్లడంలో విఫలమైయ్యారని, వారి సమస్యల పట్ల స్పందించి పరిష్కారం లభించేలా కృషి చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో లేకుంటే రాజకీయంగా ఏనాయకుడు ఎదగలేడని చెప్పారు. ఇప్పటి నుంచి ఎన్నికలు వరుసగా ఉంటాయని అందుకోసం నాయకులు, కార్యకరక్తలు సిద్దంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది. త్వరలో రాష్ట్రానికి కొత్త అధ్యక్షుని నియమాకం ఉంటుందని హైకమాండ్అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తోందని దీనిపై ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. సామాజిక, రాజకీయ సమీకరణలు బేరీజు వేస్తూ నూతన అధ్యక్షుని సెలెక్టు చేస్తామని, అదే విధంగా వారం రోజుల్లో పెండింగ్‌లో ఉన్న జిల్లాల అధ్యక్షులను కూడా నియమించనున్నట్లు నేతలకు చెప్పినట్లు సమాచారం.






