- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ సభకు 'జనాగ్రహ సభ'గా నామకరణం.. మోడీ తెలంగాణ పర్యటన వెనుక పక్కా పొలిటికల్ స్కెచ్
మే 10న ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఇంట్రెస్టింగ్‍గా మారింది. పరేడ్ గ్రౌండ్స్ సభపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ టూర్ పొలిటికల్ హీట్ పెంచుతోంది. పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ఈ నెల 10వ తేదీన తెలంగాణకు రాబోతున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి మోడీ తెలంగాణ గడ్డపై అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో బిగ్ బాస్ మోడీ కోసం తెలంగాణ బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అధికారిక కార్యక్రమాల అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సభకు 'జనాగ్రహ సభ'గా రాష్ట్ర బీజేపీ నేతలు నామకరణం చేశారు. ఈ సభ కోసం రాష్ట్రవ్యాప్తంగా నలుమూలల నుంచి సుమారు 3 లక్షల మంది జనసమీకరణ చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు భేటీ కాబోతున్నారు. మోడీ సభకు ఏర్పాట్లు, జనసమీకరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
బల్దియా సమరశంఖం:
మోడీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో బిగ్గెస్ట్ టర్నింగ్ కాబోతోందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమరం ముగించుకుని తెలంగాణ గడ్డపై ప్రభుత్వ కార్యక్రమాల కోసం అడుగుపెడుతున్న వేళ ఈ పర్యటన ద్వారా వీలైనంత మేరకు పొలిటికల్ మైలేజ్ సాధించుకునేందుకు కమలనాధులు స్కెచ్ వేస్తున్నారు. ప్రధాని రాకతో బీజేపీ బల్దియా సమరానికి నాంది పలుకుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్‍గా మోడీ ఎలాంటి అస్త్రాలు ప్రయోగించబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠగా మారుతోంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంపై ఎటాక్:
ఈ సభ ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్ పై మోడీ తీవ్ర స్థాయిలో ఎటాక్ చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల పార్లమెంట్ వేదికగా వీగిపోయిన మహిళా రిజర్వేషన్ అంశానికి సంబంధించిన బిల్లు అంశంతో ప్రత్యర్థులపై విరుచుకుపడతారనే టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లపై కాషాయజెండాలను రెపరెపలాడించేలా మోడీ స్పీచ్ రూపంలో తెలంగాణ బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నువ్వా నేనా అన్నట్లు ప్రధాన పార్టీల మధ్య రాష్ట్ర రాజకీయం సాగుతున్న వేళ జనాగ్రహ సభలో మోడీ ఎవరిపై విరుచుకుపడతారు అనేది వేచి చూడాలి.






