- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: నిరంతర అభ్యాసానికి సింపోజియం
రాష్ట్రంలో నిరంతర అభ్యాసం, విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహించే లక్ష్యంతో సింపోజియం అనే తటస్థ, లాభాపేక్షలేని జ్ఞాన వేదిక ప్రారంభమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నిరంతర అభ్యాసం, విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహించే లక్ష్యంతో సింపోజియం అనే తటస్థ, లాభాపేక్షలేని జ్ఞాన వేదిక ప్రారంభమైంది. ఈ వేదికను గిరీష్ మల్పాని, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ స్థాపించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ సమక్షంలో సీనియర్ బ్యూరోక్రాట్లు, పరిశ్రమ ప్రముఖులు, హెచ్‌ఎన్‌ఐలు, ఐఎస్బీ అలుమ్ని, ట్రస్టీలు, సలహాదారుల సమక్షంలో వేదికను ప్రారంభించారు. ట్రస్టీలుగా మాజీ ముఖ్య కార్యదర్శి డా.సమీర్ శర్మ, శ్రుతి మల్పాని, ఐఎస్‌బీ ప్రొఫెసర్ అశ్విని ఛాత్రే, శ్రీకాంత్ పొరికా మద్దతు అందిస్తున్నారు. సలహాదారులుగా హరీశ్ చంద్రప్రసాద్, కేకే మహేశ్వరి, రాహుల్ మిత్రా, శుభ్ర మహేశ్వరి వ్యవహరిస్తున్నారు. సోమవారం నిర్వహించిన ప్రారంభ సమావేశంలో ప్రొఫెసర్ అశ్విని ఛాత్రే సమన్వయంతో జరిగిన ప్యానెల్ చర్చలో ఐఎస్‌బీ డిప్యూటీ డీన్ దీపామణి, శ్రీనివాస ఫార్మ్స్‌కు చెందిన సురేష్ చిట్టూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. కేవలం ఎంఓయూలే కాకుండా వాటి అమలు కీలకమని పేర్కొన్నారు. సింపోజియం వేదిక ఏడాది పొడవునా వివిధ రంగాల నిపుణులను ఒకచోట చేర్చి, సమాజానికి ఉపయోగపడే జ్ఞాన చర్చలను ప్రోత్సహిస్తుందని తెలిపారు.






