- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ సర్కార్‌కు తీపి కబురు.. ఐపీఎస్‌ల సంఖ్య పెంపు
తెలంగాణ సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రాష్ట్రానికి ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతూ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పడున్న ఐపీఎస్‌ల సంఖ్య 139 నుంచి 151కి పెరగనుంది. ఇందులో సీనియర్ డ్యూటీ పోస్టులను 83కి పెంచింది. అదేవిధంగా స్టేట్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులను 20, సెంట్రల్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులను 33, లీవ్ రిజర్వ్, జూనియర్ పోస్టులను 13, ట్రైనింగ్ రిజర్వ్ పోస్టులను 2కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేవిధంగా అందులో ఐపీఎస్ రిక్రూట్‌మెంట్ రూల్స్-1954లోని 9వ రూల్ కింద ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు 46, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులను 105గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story






