- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు తీపికబురు.. రూ.2 లక్షల వరకు లోన్
రాష్ట్రంలో నిరుపేదలెవరూ గూడు లేకుండా ఉండొద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy Government) ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నిరుపేదలెవరూ గూడు లేకుండా ఉండొద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy Government) ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 చొప్పున తొలి విడతలో 4,16,500 ఇదిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. ఈ పథకంలో ముందుగా పూరిగుడిసెలు, అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్న వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. అదేవిధంగా సొంత స్థలం ఉన్న వారికి తొలి దశలో ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా పనుల పురోగతిని అప్‌డేట్ చేస్తుండగా ఏఐ టెక్నాలజీతో అక్రమాలను గుర్తించి, చర్యలు తీసుకుంటున్నారు.
కాగా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి దశల వారీగా రూ.5 లక్షలను సర్కార్ లబ్ధిదారుల బ్యాంకులో ఖాతాల్లో జమ చేస్తోంది. పునాది వరకు నిర్మిస్తేనే తొలి విడత సాయంగా రూ.లక్ష జమ చేస్తున్నారు. కానీ, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న కొందరు పథకానికి అర్హులైనా.. పునాదిని కూడా నిర్మించలేని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం లబ్ధిదారులకు తీపికబురు చెప్పింది. అలాంటి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లో ఇప్పటికే సభ్యులుగా ఉంటే వారికి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణం అందించనున్నారు. స్వయం సహాయక సంఘాల్లో ఎలాంటి అప్పుల్లేని సభ్యులు బ్యాంక్ లింకేజీ, సీఐఎఫ్, శ్రీనిధి ద్వారా రుణాన్ని పొందవచ్చు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రుణాలు కూడా మంజూరయ్యాయి.






