సివిల్స్ మెయిన్స్ విజేతలకు తీపికబురు.. రూ.లక్ష ప్రోత్సాహకం ప్రకటించిన సీఎం

by Kema Shiva Kumar |

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షా ఫలితాలు విడుదలైన విషయం విదితమే.

సివిల్స్ మెయిన్స్ విజేతలకు తీపికబురు.. రూ.లక్ష ప్రోత్సాహకం ప్రకటించిన సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షా ఫలితాలు విడుదలైన విషయం విదితమే. అయితే, దేశ వ్యాప్తంగా ఆగస్టు 22 నుంచి 31 వరకు జరిగిన మెయిన్‌ పరీక్షల్లో మొత్తం 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ రౌండ్‌కు ఎంపికైనట్లుగా యూపీఎస్సీ వెల్లడించింది. ఇందులో 43 మంది అభ్యర్థులు తెలంగాణ నుంచి ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే సివిల్స్ మెయిన్స్‌లో సత్తా చాటిన అభ్యర్థులను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేకంగా అభినందించారు. రాజీవ్‌‌గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద ఇంతకు ముందు అందించిన రూ.లక్షతో పాటు విజేతలంతా ఇంటర్వ్యూలకు సన్నద్ధం కావడానికి మరో రూ.లక్ష ప్రోత్సాహకం ప్రకటించారు. తుది పరీక్షలో కూడా అభ్యర్థులంతా నెగ్గి దేశానికి సేవ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.

Next Story