- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీ పదవులపై సస్పెన్స్.. డైలమాలోనే ఆ ఇద్దరు నేతలు
గవర్నర్ కోటాలో ఎంపికైన ఈ ఇద్దరు ఎమ్మెల్సీల అంశం సుప్రీంకోర్టులో ఉండటంతో ఆ కేసు తేలితేగానీ..

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవులపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. గవర్నర్ కోటాలో ఎంపికైన ఈ ఇద్దరు ఎమ్మెల్సీల అంశం సుప్రీంకోర్టులో ఉండటంతో ఆ కేసు తేలితేగానీ వీరి ఎమ్మెల్సీ పదవులపైన స్పష్టత వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొలువుదీరిన తర్వాత కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌లను గవర్నర్ కోటాలో నామినేట్ చేయడం ఆ అంశం కాస్తా సుప్రీంకోర్టులో చేరడంతో సర్వోన్నత న్యాయస్థానం వారి పదవులను రద్దు చేసింది. దీంతో మళ్లీ రాష్ట్ర మంత్రివర్గం గత ఆగష్టు 30న కోదండరాం, అమీర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ ను గవర్నర్ కోటాలో నామినేట్ చేసింది. అయితే కోర్టులో కేసుతో వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమం పెండింగ్ లో పడింది. ఇదిలా ఉంటే గత నెలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఆజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన గత అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎమ్మెల్సీ కోటా పదవుల భర్తీపై స్పష్టత లేదన్న ప్రచారం జరుగుతున్న సయమంలోనే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన ఆర్నెళ్లలోగా తిరిగి ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో ఎన్నిక కావాల్సి ఉంటుంది. దీంతో గవర్నర్ కోటా పదవుల భర్తీపై మరింత ఉత్కంఠ నెలకొన్నది.
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మంత్రి అజారుద్దీన్ ఎన్నిక కావాల్సి ఉంది. అయితే తెలంగాణ శాసన మండలిలో వచ్చే ఏడాది నవంబర్ లో మూడు ఖాళీలు ఏర్పడతాయి. అప్పటి వరకూ పదవుల ఖాళీలకు అవకాశం లేదు. మరోవైపు కవిత రాజీనామా అంశం పెండింగ్ లో ఉంది. ఆమె రాజీనామా ఆమోదించినా ఆ సీటు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచే తిరిగి భ ర్తీ చేయాల్సి ఉన్నందున ..లోకల్ బాడీ ఎన్ని కలు పూర్తయిన తర్వాతేనే ఈ సీటు భర్తీ చేసే అవకాశం ఉండటంతో అజారుద్దీన్ కి అవకా శం దాదాపు ఉండదనే ప్రచారం జరుగుతోం ది. దీంతో ఈ వ్యవహారం అంతా న్యాయస్థానం ఇచ్చే తీర్పుపైనే ఆధారపడి ఉండటంతో అప్పటి వరకూ వెయిట్ చేయడం మినహా కోదండ రాం, అజారుద్దీన్ కు మ రోమార్గం లేదన్న విశ్లేషణలు కొనసాగుతున్నా యి. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురుకాలేదని రాజకీయ పరిశీలకులు అంటు న్నారు.
ప్రభుత్వానికి ఇద్దరూ కీలకమే...
ఎమ్మెల్సీ కోదండరాం, మంత్రి అజారుద్దీన్ ఇద్దరూ కూడా ప్రభుత్వానికి కీలకంగా మారారు. కోదండరాం గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. కేసీఆర్ ప్రభుత్వంపైన కోదండరాం అనేక ఉద్యమాలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీతో ఆయన్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఆయన మద్దతు ప్రస్తుత ప్రభుత్వానికి అవసరం. తెలంగాణ సమాజంలో కోదండరాంకి తెలంగాణ ఉద్యమనేతగా ఉన్న మైలేజ్ దృష్ట్యా ఆయనకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోంది. ఇక అజారుద్దీన్ జూబ్లీహిల్స్ బైపోల్ సమయంలో ఆయనకు అనూహ్యాంగా ప్రభుత్వం మంత్రి పదవిని కట్టబెట్టింది. ఆ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు కోసం అజారుద్దీన్ కి పదవి ఇవ్వడంతో కలిసి వచ్చిందన్న అంచనాలో కాంగ్రెస్ ఉన్నది. దీంతో ఇరువురికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవులు కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో వీరికి పదవుల ఇచ్చే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.






