కరీంనగర్‌లో ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. మేయర్ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

by Kema Shiva Kumar |

కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్‌ పేర్లను బీజేపీ ఖరారు చేసి ఎన్నికల అధికారికి ప్రతిపాదించింది. మెజారిటీకి స్వల్ప దూరంలో బీజేపీ ఉన్న తరుణంలో కార్పొరేటర్ల బలాబలాల మార్పుతో మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

కరీంనగర్‌లో ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. మేయర్ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ కార్పొరేషన్‌ (Karimnagar Corporation)లో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ క్లైమాక్స్‌కు చేరుకుంది. కొద్దిసేపట్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండగా, భారతీయ జనతా పార్టీ (BJP) తన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించి రేసులో ముందడుగు వేసింది. మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్‌ (Kolagani Srinivas), డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్‌రావు (Sunil Rao) పేర్లను బీజేపీ ఖరారు చేస్తూ ఎన్నికల అధికారికి ప్రతిపాదించింది.

అయితే, కార్పొరేషన్ ఎన్నికల్లో 30 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ విషయంలో బీజేపీకి సవాల్ ఎదురవుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా కలుపుకుని బీజేపీ బలం 35గా ఉంది. కానీ, తాజాగా ఏఐఎఫ్‌బీ (AIFB) కార్పొరేటర్ కాంగ్రెస్‌లో చేరడంతో బీజేపీ బలం 34కు పడిపోయింది. మరోవైపు మ్యాజిక్ ఫిగర్‌కు అతి సమీపంలో ఉన్న బీజేపీ, ఎలాగైనా పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తుంటే.. కాంగ్రెస్ తన వ్యూహాలతో అధికార పక్షానికి చెక్ పెట్టాలని చూస్తోంది. స్వతంత్రులు, ఇతర సభ్యుల ఓట్లు ఇప్పుడు నిర్ణయాత్మకంగా మారనున్నాయి.

Next Story