- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ.. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం...
రాజకీయ రణరంగంగా మారిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ముగిసింది. కాంగ్రెస్ అభ్యంతరాల మధ్య బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్/ఇబ్రహీంపట్నం: భారీ బందోబస్తు, ఆందోళనల మధ్య జరిగిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. సంఖ్యాబలం కలిగిన బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకుంది. చైర్మన్‌గా సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా బీజేపీ పార్టీకి చెందిన ముత్యాల శ్యామల భాస్కర్ ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ అభ్యంతరం..
బీఆర్ఎస్ తరపున చైర్మన్ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ తరపున ఆకుల యాదగిరి పేర్లు ప్రతిపాదించబడ్డాయి. సభ్యులు చేతులు ఎత్తే (Show of Hands) విధానం ద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఇందులో మెజారిటీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలపడంతో సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు. అయితే, ఎన్నిక ప్రారంభానికి ముందే కాంగ్రెస్ కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముగ్గురు కౌన్సిలర్లపై కోర్టులో కేసులు కొనసాగుతున్నాయని, తీర్పు వచ్చే వరకు ఎన్నికను వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికను తాము స్వచ్ఛందంగా నిర్వహించడం లేదని, హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదల చేసి నిర్వహిస్తున్నామని ఎన్నికల అధికారి తేల్చి చెప్పారు. చట్టపరమైన అడ్డంకులు లేవని పేర్కొంటూ ప్రక్రియను కొనసాగించారు.






