- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ మంత్రి వర్గంపై కొనసాగుతున్న సస్పెన్స్!
by Sathputhe Rajesh |
తెలంగాణ ముఖ్యమంత్రి నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకుగాను ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఇక, తెలంగాణ మంత్రి వర్గంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలకు ఇంకా మంత్రి వర్గంపై సమాచారం అందలేదు. కేబినెట్ లో స్థానం కోసం పలువురికి ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే ఆహ్వాన పత్రంలో మాత్రం సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం అంటూ పేర్కొన్నారు.
కాగా , రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో మరికొద్ది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని ప్రకటించిన ఇప్పటివరకు మంత్రులు ఎవరనేది అధికారికంగా వెల్లడించలేదు. సోషల్ మీడియాలో మాత్రం మంత్రి వర్గం ఇదే అంటూ కొన్ని పత్రాలు సర్క్యూలేట్ అయ్యాయి. రేవంత్ రెడ్డి కొత్త మంత్రి వర్గంపై మధ్యాహ్నం వరకు క్లారిటీ రానుంది.
Next Story






