హైకోర్టులో కొనసాగుతోన్న సస్పెన్స్.. కాళేశ్వరంపై మరోసారి విచారణ వాయిదా

by Kema Shiva Kumar |

కాళేశ్వరం (Kaleshwaram) అవకతవకలపై జస్టిస్‌ పీ చంద్రఘోష్‌ (Justice P Chandraghosh) కమిటీ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని, సీబీఐ దర్యాప్తు నిలిపివేయాలని మాజీ సీఎం కేసీఆర్‌ (KCR), మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao) హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

హైకోర్టులో కొనసాగుతోన్న సస్పెన్స్.. కాళేశ్వరంపై మరోసారి విచారణ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం (Kaleshwaram) అవకతవకలపై జస్టిస్‌ పీ చంద్రఘోష్‌ (Justice P Chandraghosh) కమిటీ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని, సీబీఐ దర్యాప్తు నిలిపివేయాలని మాజీ సీఎం కేసీఆర్‌ (KCR), మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao) హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దిన రిటైర్డు ఐఏఎస్‌ ఎస్కే జోషి (SK Joshi), ఐఏఎస్ స్మృతి సబర్వాల్ (Smriti Sabharwal) కూడా హైకోర్టు మెట్లు ఎక్కారు. ఈ నేపథ్యంలోనే అన్ని పిటిషన్లపై సీజే అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ద్విసభ్య ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణకు ఈ నెల 12కు వాయిదా వేసింది.

కాగా, అంతుకు ముందు కేసీఆర్, హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్‌, హరీశ్‌రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లకు విచారణార్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ తన వాదనలు వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కోర్టుకు తెలిపారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక, విచ్చిన వివిధ ఫిర్యాదుల ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపడుతుందని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్‌పై లోతైన విచారణ జరపాల్సి ఉందని అభిప్రాయపడింది. వెకేషన్ అనంతరం కేసుపై విచారణ చేపడతామని.. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.

గత విచారణలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

2023 వరదల తర్వాత మెడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను రక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై వివరణాత్మక నివేదిక దాఖలు చేయాలని కోర్టు పేర్కొంది. డిసాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ సెక్షన్-39 ప్రకారం ప్రభ్యుత్వ బాధ్యత తీసుకుని ప్రజల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంది. ఘోష్ కమిషన్ రిపోర్ట్‌ను అసెంబ్లీలో చర్చించక ముందే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని.. వెంటనే ఆ డేటాను తొలగించాలని కోర్టు ఆదేశించింది.

కొలిక్కి వచ్చిన సీబీఐ ప్రాథమిక విచారణ

అయితే, కేసులో ఇప్పటికే సీబీఐ (CBI) ప్రాథమిక విచారణను ప్రారంభించింది. కాళేశ్వరం జస్టీస్ పీ చంద్రఘోష్ కమిషన్, ఎన్‌డీఎస్‌ఏ (NDSA), విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (Vigilance and Enforcement Department రిపోర్టులు, కీలక డాక్యుమెంట్లను సేకరించారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ (Praveen Sood) సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లో ప్రత్యేక నిర్వహించి, విచారణ ప్రణాళికను రూపొందించారు. కేసులో ప్రాథమిక పరిశీలన పూర్తి కావస్తున్న నేపథ్యంలో సీబీఐ, కేంద్ర హోంశాఖ అనుమతితో ఏ క్షణానైనా బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది.

Next Story