- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శిశు విక్రయాల ముఠా గుట్టురట్టు.. గతంలోనే హెచ్చరించిన దిశ
సూర్యాపేట జిల్లాలో సంతానం లేక కష్టాల్లో ఉన్న దంపతులను లక్ష్యంగా చేసుకుని, వారి వివరాలను సేకరించి పిల్లలను విక్రయిస్తున్న ఓ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను సూర్యాపేట పోలీసులు గుట్టు రట్టుగా చేశారు.

దిశ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో సంతానం లేక కష్టాల్లో ఉన్న దంపతులను లక్ష్యంగా చేసుకుని, వారి వివరాలను సేకరించి పిల్లలను విక్రయిస్తున్న ఓ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను సూర్యాపేట పోలీసులు గుట్టు రట్టుగా చేశారు. గతంలోనే సూర్యాపేట జిల్లాలో ఈ దందా కొనసాగుతుందని "దిశ దినపత్రిక" పలు వార్తలను ప్రచురింతం చేసింది. జిల్లాలో కి లేడి గ్యాంగ్ జిల్లాలో గుట్టుగా పసిపిల్లల విక్రయ దందా అని దిశ పత్రిక వార్తలను ప్రచురితం చేసి ముందే హెచ్చరించింది. ఎట్టకేలకు అప్రమత్తమైన జిల్లా పోలీసులు జిల్లా కేంద్రంలో అంతరాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలోని 20 మందిని అరెస్ట్ చేశారు.
ఇందులో ఎనిమిది మంది మహిళలు, 12 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు 18 మంది పిల్లలనీ, పిల్లల తల్లిదండ్రుల నీ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వారి లో 15 నెలల మగ శిశువును గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. ముక్కు పచ్చలారని పసికందుల నీ అంగట్లో సరుకులాగా అమ్ముతున్న 20 మందిని పోలీసులు పట్టుకున్నారు.
ఈ ముఠా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్,గుజరాత్ రాష్ట్రాల్లో పిల్లలను కనీ పోషించలేని తల్లిదండ్రుల నుండి పిల్లలను శిశువులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆయా రాష్ట్రాల నుంచి శిశువులను రూ. 2- 3 లక్షల కి తీసుకవస్తూ జిల్లాలో ఒక్కో శిశువును రూ.7 లక్షల నుంచి 9 లక్షల అమ్ముతున్నట్లు సమాచారం. నిందితుల్లో సూర్యాపేటకు చెందిన కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్న దంపతులు, ఒక నర్సు, ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నిందితులపై గతంలో శిశు విక్రయాల కేసులు ఏమైనా ఉన్నాయా లేదా అనే విషయాలపై జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు.






