సినిమా అవకాశాల కోసమే: సూర్యాభాయ్ గోల్డ్ మ్యాన్ అవతారం!

by Gantepaka Srikanth |

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేశ్ కుమార్‌ బండారం బట్టబయలైంది.

సినిమా అవకాశాల కోసమే: సూర్యాభాయ్ గోల్డ్ మ్యాన్ అవతారం!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేశ్ కుమార్‌ బండారం బట్టబయలైంది. ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విచారణలో అసలు తేలింది. సూర్యాభాయ్ ధరించే ఆభరణాలు అన్నీ రాగితో చేసి రోడియం పూత వేసినవని, వాటి విలువ కేవలం రూ.3 లక్షలు మాత్రమేనని అధికారులు తేల్చారు. ఒక్క ఆభరణానికి మాత్రమే వెండిపై బంగారు పూత పూసినట్లు గుర్తించారు. ధనవంతుడిగా కనిపించేందుకు సుమారు 32 రకాల నకిలీ ఆభరణాలను వాడినట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాదు.. సొంత ఇల్లు లేక రూ.20 వేల కిరాయికి అద్దె ఇంట్లో సూర్యాభాయ్ జీవనం సాగిస్తున్నారు. గత ఆరేళ్లుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుండా, కేవలం 2022-23లో రూ.4.9 లక్షల ఆదాయం చూపారు. ప్రజల్లో గుర్తింపు, సినిమా అవకాశాలు పొందాలనే ఉద్దేశంతోనే ఇలా 'గోల్డ్ మ్యాన్'గా ప్రచారం చేసుకున్నానని విచారణలో వెల్లడించారు. కొండా విజయ్ కుమార్ అనే వ్యక్తిపై జరుగుతున్న ఐటీ విచారణలో భాగంగా వెలుగులోకి సూర్యాభాయ్ భాగోతం తేటతెల్లమైంది.

Next Story